బిడ్డను గుండెలకు హత్తుకుని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పోస్టు.. స్పందించిన ఇరాన్
- ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్
- సామాజిక మాధ్యమంలో ఆనందాన్ని పంచుకున్న కరోలిన్
- కరోలిన్‌కు శుభాకాంక్షలు చెప్పిన అమెరికాలోని ఇరాన్ ఎంబసీ
- అదే సమయంలో, మీ బాస్ పిల్లలను హత్య చేశాడని గుర్తు చేసిన ఇరాన్
- ఆ పిల్లలను కూడా మీలాగే తొమ్మిది నెలలు మోసి కన్నవారేనని పేర్కొన్న ఇరాన్
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్‌కు కుమార్తె జన్మించిన సందర్భంగా ఇరాన్ అభినందనలు తెలిపింది. అయితే, ఫిబ్రవరి 28న మినాబ్‌లోని ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 168 మంది మరణించడం, వారిలో చాలామంది చిన్నారులు ఉండటంతో ఈ సందర్భంగా ఆ విషాద ఘటనను గుర్తు చేసింది.
కరోలిన్ లీవిట్ ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారికి వివియానా అని పేరు పెట్టారు. ఈ మేరకు కరోలిన్ తన సామాజిక మాధ్యమ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. లీవిట్ తన బిడ్డను గుండెలకు హత్తుకుని ఉన్న చిత్రాన్ని పోస్టు చేశారు.
ఈ పోస్టుపై అమెరికాలోని ఇరాన్ ఎంబసీ స్పందించింది. మొదట కరోలిన్ లీవిట్‌కు శుభాకాంక్షలు తెలిపింది. అదే సమయంలో, మినాబ్ ఘటనను ప్రస్తావించింది. పిల్లలు అమాయకులని, వారికి ప్రేమించడం తప్ప మరేమీ తెలియదని తెలిపింది. కానీ మినాబ్‌లోని పాఠశాలలో మీ బాస్ హత్య చేసిన పిల్లలు కూడా మీలాంటి తల్లులు తొమ్మిది నెలలు మోసి కన్నవారే కదా అని పేర్కొంది. మీరు మీ బిడ్డను ముద్దు పెట్టుకోవడానికి ముందు ఆ తల్లుల గురించి కూడా ఒక్కసారి ఆలోచించాలని సూచిస్తూ ఇరాన్ ఎంబసీ పోస్టు పెట్టింది.